ద్వితీయ రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు బహుమతి ప్రధానం.

జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు నెలరోజుల పాటు ఆన్లైన్లో నిర్వహించబడినాయి. అందులో విజేతలను రాష్ట్రస్థాయి వర్చువల్ సమావేశంలో *రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎం గేయానంద్, కుర్రా రామారావు ,విద్యా విభాగం రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం గేయానంద్ గారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మకతను, హేతుబద్ధతను , శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకుగాను సైన్స్ ప్రయోగాల వీడియో కంటెస్టుని నిర్వహించడం జరిగిందన్నారు. జెవివిగా ఇటువంటి విద్యా విషయక కార్యక్రమాల్ని కొనసాగిస్తామని తెలిపారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నాయకులు మహేష్, వీడియో కంటెస్టు న్యాయ నిర్ణీతలు ఎమ్మెస్ యుగంధర్ బాబు, కె ఎస్ జిలాని భాషాలు మాట్లాడుతూ సైన్స్ బోధన ,అభ్యాసం ప్రయోగాలు కృత్యాల ద్వారా చేస్తే సమగ్ర అభ్యసన సాధ్యమవుతుందని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో వందలాదిమంది విద్యార్థులు వినూత్నమైన ప్రయోగ వీడియోలు రూపొందించి సైన్స్ పట్ల తమ జిజ్ఞాసను తెలియజేశారన్నారు. విద్యార్థినీ విద్యార్థుల కృషికి అభినందనలు తెలిపారు.

జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపన నాయకులు పూర్వ పిడిఎఫ్ ఎమ్మెల్సీ శ్రీ విఠపు బాలసుబ్రమణ్యం గారు సందేశమిస్తూ నాణ్యమైన శాస్త్రీయ విద్యను అందించడానికి ప్రభుత్వాలు ప్రయోగశాలలు, వనరులు సమకూర్చాలని, ఉపాధ్యాయులు
ప్రయోగాత్మక బోధన చేయడం ద్వారా సైన్స్ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు .
జెవివి విద్య విభాగం సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన మొదటి మూడు టీముల విద్యార్థిని విద్యార్థులకు 26 జిల్లాల్లో మొదటి రెండు స్థానాల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థినీ విద్యార్థికి ఈ సర్టిఫికేట్ పంపడం జరుగుతుందని తెలిపారు.
ఆశాస్త్రీయ భావాలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథం పెంచే కృషిలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులు భాగస్వామ్యం కావాలని కోరారు.
సమావేశంలో జె వి వి రాష్ట్ర నాయకత్వం కాంటెస్ట్ లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జె వి వి ఏపీ 2024 రాష్ట్రస్థాయి ఆన్లైన్ సైన్స్ వీడియో పోటీల విజేతలు:
ప్రథమ బహుమతి: కర్నూలు జిల్లా భాష్యం స్కూల్ విద్యార్థులు స్నేహిత అమూల్య ప్రణీత
ద్వితీయ బహుమతి: శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం డి బోండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం చరణ్ తేజ
తృతీయ బహుమతి: పల్నాడు జిల్లా ఇప్పుడు మండలం బొగ్గారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఏ చెన్నకేశవ.
జిల్లాస్థాయి విజేతల వివరాలను ఆయా జిల్లా బాధ్యులకు అందజేయడం జరిగిందని వారు తెలిపారు.
G.Giridhar, Convenor, Education Sub Committee, 8500960840
జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ (జె వి వి ఏపీ)

Leave a Reply